జైలర్ 2 మూవీ రివ్యూ, రేటింగ్ (Jailer 2 Review)
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ జైలర్ 2 (Jailer 2). సన్ పిక్చర్స్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం అయిన ఈ మూవీ నిన్న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీలో రమ్య కృష్ణ, విద్య బాలన్, సూరజ్ వింజరమూడు, ఎస్ జె సూర్య, యోగి బాబు, మిర్నా, తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన జైలర్ పై ప్రారంభం నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మూడేళ్ళ క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జైలర్ కి ఇది సీక్వెల్. దానితో జైలర్ 2 పై అంచనాలు మరింత ఏర్పడ్డాయి. మరి ఈ మూవీ ఎంత మేర అంచనాలు అందుకుంది, ఏ స్థాయిలో మెప్పించింది అనేది మొత్తం ఈ రివ్యూ లో చూద్దాం.
మూవీ పేరు : జైలర్ 2
విడుదల తేదీ : 15-10-2026
నటీనటులు : రజినీకాంత్, ఎస్ జె సూర్య, రమ్యకృష్ణ, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి, సూరజ్ వింజరమూడు, యోగిబాబు, మిర్నా తదితరులు
దర్శకుడు : నెల్సన్ దిలీప్ కుమార్
నిర్మాత : కళానిధి మారన్
సంగీతం : అనిరుద్ రవిచందర్
ఫోటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కణ్ణన్
ఎడిటింగ్ : ఆర్. నిర్మల్
కథ :-
రిటైర్డ్ అయి టైగర్ ముత్తువేల్ హ్యాపీగా తన ఫ్యామిలీ తో గడుపుతూ ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తుంటాడు. మరోవైపు వర్మని చంపిన వ్యక్తి గురించి తెలుసుకునేందుకు విలన్ ఎస్ జె ఫ్యామిలీ వెతుకుతూ ఉంటుంది. అయితే అనుకోకుండా ముత్తువేల్ చుట్టూ కొన్ని అనుకోని సమస్యలు చోటుచేసుకుంటాయి. ఆ క్రమంలో పలు పురాతన విగ్రహాలను కాపాడేందుకు అలానే తన కుటుంబం కోసం ముత్తువేల్ మళ్ళీ రంగంలోకి దిగాల్సి వస్తుంది. మధ్యలో విద్యా బాలన్ ఫ్యామిలీ టైగర్ గురించి తెలుసుకోవడం, తమ నుండి పోయిన విగ్రహాల వెతుకులాట ప్రారంభించడం, వారి ప్రయత్నాల నుండి ముత్తువేల్ ఏ విధంగా బయటపడ్డాడు, ఎస్ జె సూర్య ఫ్యామిలీని చివరికి ఏ విధంగా అంతం చేసాడు, తన మిషన్ ని చివరకు ఏ విధంగా పూర్తి చేసాడు అనేది మొత్తం వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :-
ముందుగా జైలర్ 2 లో టైగర్ ముత్తువేల్ పాండియన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ పెర్ఫార్మన్స్ పెద్ద హైలైట్. 74 ఏళ్ళ వయసులో కూడా అదే వన్నెతరగని స్టైల్, యాక్టింగ్, స్వాగ్ తో రజిని తన మార్క్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన మరింత బాగుంది. ఇక ఆయన భార్యగా నటించిన రమ్యకృష్ణ పాత్ర ఆకట్టుకున్నారు. విలన్ గా చేసిన ఎస్ జె సూర్య, సూరజ్ వింజరమూడు, సపోర్ట్ పాత్రలు చేసిన మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ కూడా తమ పెర్ఫార్మన్స్ లతో అలరించారు.
దర్శకుడు నెల్సన్ జైలర్ 2 మూవీని ఆద్యంతం ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకాభిమానులని అలరించేలా తీర్చిదిద్దారు. ఇక మధ్యలో యోగిబాబు సహా ఇతర పాత్రల డార్క్ హ్యూమర్ కామెడీ బాగా పండింది. ఫస్ట్ హాఫ్ కథనం ఎంతో రేసిగా సాగుతుంది. అనిరుద్ రవిచందర్ అందించిన సాంగ్స్ పర్వాలేదనిపించగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి పెద్ద బలం. విజయ్ కార్తీక్ కణ్ణన్ విజువల్స్ తో పాటు సినిమాని ఎక్కువ నిడివి లేకుండా ఎడిటర్ ఆర్ నిర్మల్ కరెక్ట్ గా సీన్స్ కట్ చేసారు. భారీ నిర్మాణ విలువలతో కళానిధి మారన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీని గ్రాండ్ గా నిర్మించారు. అతిథి పాత్రలు చేసిన హృతిక్ రోషన్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ అందరి క్యామియోలు సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి.
మైనస్ పాయింట్స్ :
నిజానికి జైలర్ 1 మూవీతో పోలిస్తే జైలర్ 2 ఆడియన్స్ ని మరింతగా ఆకట్టుకుంటుందని చెప్పాలి. సెకండ్ హాఫ్ అక్కడక్కడా కొద్దిగా నెమ్మదించినట్లు అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ బాగున్నా ఆ సీన్స్ ప్రేక్షకులని పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేంతగా లేవు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు గతంలో చూసినట్లు అనిపిస్తాయి. సాంగ్స్ కూడా కొంత బోరింగ్ గా అనిపిస్తాయి. ఇంతకుమించి పెద్దగా మైనస్ పాయింట్స్ లేవు.
సాంకేతిక విభాగం :
జైలర్ 2 మూవీలో సాంకేతిక విభాగం పనితీరు ఎంతో బాగుంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కథ, కథనాలను యాక్షన్, ఎమోషనల్ అంశాలతో పూర్తిగా బ్యాలన్స్ చేస్తూ నడిపారు. సెకండ్ హాఫ్ లో తన కుటుంబానికి నిజం తెలిసినపుడు రజినీకాంత్ పాత్ర నడిచే తీరు, మధ్యలో ఎలివేషన్స్ పక్కాగా జాగ్రత్తగా రాసుకున్నారు. ఇక అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా ఉంది. సీన్స్ కి తగ్గట్లు హీరో రజినీని ఎలివేట్ చేస్తూ వచ్చే బీజీఎమ్ థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తుంది. చాలా చోట్ల ఫోటోగ్రఫి నాచురల్ అనిపించడంతో పాటు పలు సన్నివేశాలు విజువల్ గా బాగుంటాయి. విజయ్ కార్తీక్ కణ్ణన్ పని తీరు ఆ విధంగా ఎంతో ఆకట్టుకుంది. నిర్మాత కళానిధి మారన్ కూడా ఖర్చు విషయంలో రాజీ పడకుండా జైలర్ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎడిటింగ్ విభాగంతో పాటు ప్రతి శాఖ జైలర్ 2 మూవీకి సంబంధించి పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనపడుతుంది.
తీర్పు:
సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ 2 మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా తెరకెక్కింది. రజిని తన మార్క్ స్టైల్, యాక్టింగ్ తో మరొక్కసారి అదరగొట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాండియర్ విజువల్స్, అదిరిపోయే స్పెషల్ క్యామియో అపియరెన్సెస్ ఈ సినిమా సక్సెస్ కి ప్రధాన బలాలు. ఈ మూవీలో కూడా నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. మంచి యాక్షన్ కమర్షియల్ సినిమాలు కోరుకునే వారికి జైలర్ 2 బాగా నచ్చుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీ చూడొచ్చు.
ముగింపు :
మొత్తంగా సూపర్ స్టార్ రజినికాంత్ జైలర్ 2 తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ ని సంపాదించి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది. రజినీకాంత్ మాస్ యాక్టింగ్, స్టైల్స్ తో పాటు అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దర్శకుడు నెల్సన్ ఆకట్టుకునే టేకింగ్, స్పెషల్ క్యామియో పాత్రలు అలరిస్తాయి. జైలర్ సక్సెస్ తో మంచి క్రేజ్ తో రిలీజ్ అయిన జైలర్ 2 సక్సెస్ తో రజినీకాంత్ ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. డే 1 నుండి భారీ ఓపెనింగ్స్ తో ప్రారంభమైన ఈ మూవీ ఓవరాల్ గా ఎంతమేర కొల్లగొడుతుందో చూడాలి
సినిమా తెలుగు రేటింగ్ : 3.75 / 5
ఇటువంటి మరిన్ని తాజా సినిమాల రివ్యూస్, లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ కోసం మా సినిమా తెలుగు చూడండి.
రచయిత విక్రమ్ రాసిన ఈ ఆర్టికల్ 18 అక్టోబర్ 2026 న పబ్లిష్ చేయబడింది.


Pingback: జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్: తెలుగు రాష్ట్రాలు, వరల్డ్‌వైడ్ వసూళ్లు