జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్ - రజనీకాంత్ సినిమా వసూళ్ల అప్‌డేట్

జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్: తెలుగు రాష్ట్రాలు, వరల్డ్‌వైడ్ వసూళ్లు

జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్ రిపోర్ట్

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ జైలర్ 2 (Jailer 2) . మూడేళ్ళ క్రితం రిలీజ్ అయి పెద్ద సక్సెస్ సాధించిన జైలర్ మూవీకి ఇది అఫీషియల్ సీక్వెల్. సన్ పిక్చర్స్ సంస్థ పై కళానిధి మారన్ గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా రమ్యకృష్ణ (Ramya Krishnan), మిర్నా (Mirnaa), ఎస్ జె సూర్య (SJ Suryah), సూరజ్ వెంజిరమూడు (Suraj Venjeramoodu), యోగి బాబు (Yogi Babu), విద్యా బాలన్ (Vidya Balan), మేఘన రాజ్, నమో నారాయణ తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు.

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఇందులో ప్రత్యేకంగా క్యామియో పాత్రలు చేసారు. విజయ్ కార్తీక్ కణ్ణన్ ఫోటోగ్రఫి అందించిన ఈ మూవీలో టైగర్ ముత్తువేల్ పాండియన్ అనే పవర్ఫుల్ జైలర్ పాత్రలో రజినీకాంత్ నటించారు. మొదటి నుండి అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ నుండి ముందుగా రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై బాగా హైప్ ఏర్పరిచాయి.

వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న జైలర్ 2

రిలీజ్ రోజున ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది జైలర్ 2 మూవీ. తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. అగ్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ జైలర్ 2 రైట్స్ ని రూ. 52 కోట్లకు సొంతం చేసుకుని భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసారు. ముఖ్యంగా మూవీలో మరొకసారి సూపర్ స్టార్ రజినీకాంత్ అదిరిపోయే పెర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు దర్శకడు నెల్సన్ దిలీప్ కుమార్ కథ కథనాలను నడిపిన తీరు గురించి ప్రేక్షకులు బాగా పాజిటివ్ గా చెప్తున్నారు.

అనిరుద్ రవిచందర్ అందించిన సాంగ్స్ తో మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జైలర్ 2 సక్సెస్ లో ఒక ప్రధాన భూమిక పోషిస్తోంది. ప్రత్యేకంగా రజినీకాంత్ పై వచ్చే ఎలివేషన్ సీన్స్ తో పాటు సందర్భాన్ని బట్టి సినిమాలో వచ్చే క్యామియో పాత్రల ఎంట్రన్స్ టైంలో కూడా అనిరుద్ తన అదిరిపోయే బీజీఎమ్ తో అనిరుద్ అదరగొట్టాడు. జైలర్ 1 లో హుకుం సాంగ్ ఎంతో పాపులర్ అవ్వగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. అదే తీరున ఆ సాంగ్ ని జైలర్ 2 లో కూడా పలు సీన్స్ లో హీరో పాత్రని ఎలివేట్ చేస్తూ అనిరుద్ అదరగొట్టి రజిని ఫ్యాన్స్ ని ప్రేక్షకులని మెప్పించారు.

రజిని ఫ్యాన్స్ అయితే ఆయన ఎలివేషన్ సీన్స్ ని ఆయన పవర్ఫుల్ యాక్టింగ్ ని థియేటర్స్ లో చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తన మార్క్ స్టైల్, స్వాగ్ తో సూపర్ స్టార్ అదరగొట్టడంతో మూవీ లవర్స్ సైతం థియేటర్స్ లో మూవీని ఎంతో ఆస్వాదిస్తున్నారు. ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా కథనాన్ని దర్శకుడు దిలీప్ కుమార్ నడిపిన విధానాన్ని పలువురు విశ్లేషకులు కూడా మెచ్చుకుంటున్నారు. మొదటి షో కి సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అంటూ ఒకింత మిశ్రమంగా స్పందన లభించినప్పటికీ మెల్లగా జైలర్ 2 ఆకట్టుకుంటూ ప్రస్తుతం బాక్సాఫీస్ దుమ్మురేపుతూ అన్ని ఏరియాస్ లో దూసుకెళ్తోంది.

విజయ్ కార్తీక్ కణ్ణన్ ఫోటోగ్రఫి పలు సీన్స్ లో బాగుండడంతో పాటు విజువల్ గా ఆడియన్స్ కి మంచి ఫీల్ అందిస్తుంది. నిర్మాత కళానిధి మారన్ మూవీ ఖర్చు పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ గా నిర్మించారు. ఎడిటర్ ఆర్ నిర్మల్ పని తీరు కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎంతో రేసిగా సాగిన జైలర్ 2 మూవీ సెకండ్ హాఫ్ కూడా ఇంటరెస్టింగ్ గా కొనసాగుతుంది. ఆ విధంగా పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు నెల్సన్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఇక తమిళనాడు తో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా జైలర్ మూవీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతోంది. ఈ సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. 

జైలర్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ – రూ. 600 కోట్లు

థియేట్రికల్ హక్కులు – రూ. 325 కోట్లు 

నాన్ థియేట్రికల్ హక్కులు – రూ. 275 కోట్లు

డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని అమెజాన్ ప్రైమ్ రూ. 160 కోట్లకు దక్కించుకుంది. 

జైలర్ 2 బడ్జెట్ – రూ. 400 కోట్లు

జైలర్ 2 బ్రేకివెన్ టార్గెట్ – రూ. 650 కోట్లు గ్రాస్

జైలర్ 2 తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 48 కోట్లు NRA

ఇందులో నైజాం హక్కులు రూ. 20 కోట్లు  

ఆంధ్ర హక్కులు – రూ. 20 కోట్లు 

సీడెడ్ హక్కులు – రూ. 8 కోట్లు

జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్ :- (గ్రాస్)

డే 1 – రూ. 130 కోట్లు గ్రాస్

డే 2 – రూ. 87.48 కోట్లు

డే 3 – రూ. 103.26 కోట్లు

డే 4 – రూ. 98.9 కోట్లు

డే 5 – రూ. 59.97 కోట్లు

డే 6 – రూ. 65.22 కోట్లు

మొత్తంగా 6 రోజులకు గాను జైలర్ 2 మూవీ వరల్డ్ వైడ్ రూ. 544 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని కొల్లగొట్టింది. అందులో రూ. 203 కోట్లు ఓవర్సీస్ కలెక్షన్, అలానే రూ. 341 ఇండియా నుండి రాబట్టింది ఉంది. అంటే మొత్తంగా 6 రోజుల్లో 90% రికవరీ చేసింది ఈ మూవీ. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేడు 7వ రోజుతో ఈ మూవీ ఆల్మోస్ట్ బ్రేకివెన్ అందుకుని ఇక్కడి నుండి లాభాల బాట పట్టనుంది. కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బాగానే కాలేచ్ట్ చేసి సూపర్ స్టార్ రజినీకాంత్ స్టార్ పవర్ ని మరొకసారి రుజువు చేసింది ఈ మూవీ. ఇక ఈ మూవీ అనంతరం దీనికి సీక్వెల్ గా జైలర్ 3 ని కూడా మూవీ ఎండ్ కార్డులో వేయడంతో ఆ మూవీ ఎప్పుడు వస్తుందో అని సూపర్ స్టార్ రజిని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి టోటల్ గా లాంగ్ రన్ లో జైలర్ 2 ఎంత మేర కలెక్షన్ కొల్లగొడుతుందో తెలియదలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే.

ఇటువంటి మరిన్ని తాజా సినిమాల రివ్యూస్, లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ కోసం మా సినిమా తెలుగు చూడండి

రచయిత విక్రమ్ రాసిన ఈ ఆర్టికల్ 22 అక్టోబర్ 2026న పబ్లిష్ చేయబడింది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *