టాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అప్డేట్స్ 2026
2026 ఆల్మోస్ట్ మరొక రెండున్నర నెలల్లో ముగియనుంది. ఇక ఈ ఏడాది ఇప్పటికే టాలీవుడ్ లో అనేక సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చాయి. అయితే వాటిలో కొన్ని అందరినీ ఆకట్టుకుని భారీ విజయాలు సొంతం చేసుకోగా మరికొన్ని ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాయి. ముందుగా 2026 సంక్రాంతికి రిలీజ్ అయిన ది రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయాలకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు వంటి సినిమాలు మొదలుకుని తాజాగా రిలీజ్ అయిన ఇరుముడి, ది పారడైస్ వరకు రిలీజ్ అయిన వాటిలో అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాల జాబితా ఇప్పుడు చూద్దాం.
పెద్ది (Peddi)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపొందిన పెద్ది మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా ఇందులో పెద్దిగా రామ్ చరణ్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి మంచి ప్రసంశలు దక్కాయి. సాంగ్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఈ సినిమాకి ప్రధాన బలాలు. ఫస్ట్ హాఫ్ బాగా నడిచిన ఈ మూవీ ఈ మూవీ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొంత నెమ్మదించినప్పటికీ మొత్తంగా సక్సెస్ఫుల్ మూవీగా చెప్పాలి. ఇక పెద్ది మూవీ ఈ ఏడాది రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకి అత్యధిక కలెక్షన్ రూ. 335 కోట్లు కొల్లగొట్టి టాప్ స్థానంలో నిలిచింది.
మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara prasad Garu)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూవుపొందిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించగా బీమ్స్ సిసిలోరియో సంగీతం సమకూర్చారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ మూవీలో వరప్రసాద్ గారు గా మెగాస్టార్ చిరంజీవి మరొకసారి తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్, క్యాథరీన్ త్రెసా, జారినా వాహబ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీలో అనిల్ రావిపూడి అలరించే కథ, కథనాలతో పాటు కామెడీ, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ అందరినీ ఆకట్టుకుని భారీ విజయం అందించాయి. ఇక మన శంకరవరప్రసాద్ గారు మూవీ క్లోసింగ్ లో రూ. 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది.
ఇరుముడి (Irumudi)
మాస మహారాజా రవితేజ హీరోగా శివా నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఇరుముడి. బేబీ నక్షత్ర, ప్రియా భవాని శంకర్, స్వశిక, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మించారు. ఇక ఈ మూవీలోని మల్లెపూల పల్లకి సాంగ్ రిలీజ్ కి ముందే విశేష ఆదరణ అందుకోవడంతో పాటు ఇతర సాంగ్స్, ట్రైలర్ సహా అన్ని సినిమా పై బాగా క్రేజ్ ఏర్పరిచాయి. రిలీజ్ అనంతరం ఇరుముడి అందరి అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి హీరోగా రవితేజ కు మంచి కం బ్యాక్ అందించింది. సినిమాలో సాంగ్స్, తండ్రి కూతురు అనుబంధం, ఎమోషనల్ సీన్స్ వంటివి అందరినీ ఆకట్టుకోగా, దర్శకుడు శివ నిర్వాణ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. ఇక ఇరుముడి మూవీ ఓవరాల్ గా రూ. 250 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది.
ది రాజా సాబ్ (The Raja Saab)
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రియాంక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ యాక్షన్ హర్రర్ కామెడీ ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్. ఈ మూవీని మారుతీ తెరకెక్కించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గ్రాండ్ గా నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ ప్రారంభం నుండి అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచింది. ట్రైలర్, సాంగ్స్ తో హైప్ ఏర్పరిచిన ది రాజా సాబ్ మూవీ రిలీజ్ అనంతరం మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఓపెనింగ్స్ బాగానే రాబట్టినప్పటికీ క్లోసింగ్ చాలా చోట్ల రాజా సాబ్ నష్టాలు మిగిల్చింది. ప్రభాస్ యాక్టింగ్, అక్కడక్కడా మారుతీ తీసిన కొన్ని సీన్స్, రెండు సాంగ్స్, పలు చోట్ల కామెడీ, యాక్షన్ సీన్స్ వంటివి ఇందులో ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ రూ. 200 కోట్ల కలెక్షన్ ని ఓవరాల్ గా అందుకుంది.
ది పారడైస్ (The Paradise)
నాచురల్ స్టార్ నాని హీరోగా కయదు లోహర్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ మాస్ మూవీ ది పారడైస్. అనిరుద్ సంగీతం అందించిన ఈమూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ పై సుధాకర్ చెరుకూరి భారీగా నిర్మించారు. ముఖ్యంగా ది పారడైస్ నుండి ముందుగా రిలీజ్ అయిన ఆయా షేర్, ఏష నాగుల లిరికల్ సాంగ్స్ రెండూ కూడా ఆకట్టుకోవడంతో పాటు అవి సినిమా పై భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పరిచాయి. అయితే రిలీజ్ అనంతరం మాత్రం మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. జడల్ గా నాని మరొకసారి ఆకట్టుకునే నటన, తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్, అక్కడక్కడా పలు యాక్షన్ సీన్స్ వంటివి బాగుంటాయి. అయితే మితిమీరిన వయొలెన్స్ వంటివి ఈ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంత దూరం చేసాయి. అనిరుద్ అందించిన సాంగ్స్ తో బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరొక బలం. కాగా ఈ మూవీ క్లోసింగ్ లో రూ. 175 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది.
అనగనగా ఒక రాజు : (Anaganaga Oka Raju)
యువ నటుడు నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా మారి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అనగనగా ఒక రాజు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ టీజర్,సాంగ్స్, ట్రైలర్ తో మంచి హైప్ ఏర్పరిచి సంక్రాంతికి రిలీజ్ అయి సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. హీరో నవీన్ పోలిశెట్టి మరొక్కసారి తన నటనతో ఈ చిత్రంలో ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ కనబరిచారు. హీరోయిన్ మీనాక్షి అందం, అభినయంతో పాటు కామెడీ, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ఈ సినిమా సక్సెస్ కి ప్రధాన బలాలు. మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. మొత్తంగా అనగనగా ఒక రాజు మూవీ క్లోసింగ్ లో రూ. 105 కోట్ల కలెక్షన్ రాబట్టింది.
మా ఇంటి బంగారం (Maa Inti Bangaram)
స్టార్ నటి సమంత ప్రధాన పాత్రలో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ మా ఇంటి బంగారం. సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, శ్రీముఖి, గౌతమి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేసారు. సాంగ్స్, ట్రైలర్ తో ఆకట్టుకుని ప్రేక్షకాభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ రోజు నుండి సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా స్వర్ణ / ఝాన్సీ పాత్రలో సమంత అద్భుత నటనకు అందరి నుండి మంచి ప్రసంశలు కురిసాయి. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన కథ, కథనాలు బాగున్నాయి. పలు చోట్ల సమంత చేసిన ఫైట్స్ తో పాటు సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ కూడా అలరిస్తుంది. కాగా మా ఇంటి బంగారం మూవీ క్లోసింగ్ లో రూ. 100 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రాశి ఖానా మరొక కీలక పాత్ర చేసారు. గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం ఎన్నో ఏళ్ళ తరువాత వస్తున్న క్రేజీ కాంబినేషన్ మూవీ కావడంతో దీనిపై పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్సు లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ అనంతరం మాత్రం మూవీ అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయింది. ముఖ్యంగా ఆ ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ కళ్యాణ్ నటన, సాంగ్స్, యాక్షన్ సీన్స్ వంటివి ఆకట్టుకున్నప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ తీసిన కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో మూవీ ఫ్లాప్ అయింది. కాగా ఈ మూవీ ఓవరాల్ గా రూ. 95 కోట్ల కలెక్షన్ అందుకుంది.
లెనిన్ (Lenin)
అఖిల్ అక్కినేని హీరోగా మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మాస్ మూవీ లెనిన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ప్రమోద్ పంజు విలన్ పాత్ర చేసారు. ఇక ప్రారంభం నుండి మంచి క్రేజ్ ఏర్పరిచిన లెనిన్ మూవీ ఆ తరువాత రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ తో ఆడియన్స్, ఫాన్స్ లో ఆ క్రేజ్ మరింత పెంచింది. ఇక రిలీజ్ అనంతరం అందరి అంచనాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుంది లెనిన్. హీరో హీరోయిన్స్ ఇద్దరి ఆకట్టుకునే నటనతో పాటు అందరినీ అలరించే విధంగా దర్శకుడు మురళి కిశోరె కథ, కథనాలను నడిపించితిన్ తీరు ఎంతో బాగుంటుంది. సంగీత దర్శకుడు థమన్ అందించిన సాంగ్స్, తో పాటు బ్యాక్ గ్రౌండ్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ వంటివి ఈ మూవీకి ప్రధాన బలాలు. కాగా లెనిన్ మూవీ మొత్తంగా రూ. 75 కోట్ల కలెక్షన్ రాబట్టింది.
చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story)
కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీ చెన్నై లవ్ స్టోరీ. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ సంస్థల పై శ్రీనివాస్ కుమార్ నాయుడు, సాయి రాజేష్ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ తో బాగా హైప్ ఏర్పరిచి రిలీజ్ అనంతరం సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. హీరోగా కిరణ్ సబ్బవరం మరొక్కసారి ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ కూడా తన పాత్రలో ఒదిగిపోయి నటించారు. మణిశర్మ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, లవ్, ఎమోషనల్ సీన్స్, దర్శకుడు రవి అలరించే టేకింగ్ వంటివి ఈ మూవీకి ప్రధాన బలాలుగా చెప్పవచ్చు. ఇక ఈ మూవీ క్లోసింగ్ లో రూ. 60 కోట్లల్లో రాబట్టింది.
ఇటువంటి తాజా చిత్రాల రివ్యూస్, లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ కోసం మా సినిమా తెలుగు చూడండి
రచయిత విక్రమ్ రాసిన ఈ ఆర్టికల్ 13 అక్టోబర్ 2026న పబ్లిష్ చేయబడింది.

