ఇరుముడి డిటైల్డ్ ఓటిటి రివ్యూ : మూవీకి ఊహించని రెస్పాన్స్
మాస్ మహారాజా రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన చిత్రాలు ఏవి కూడా ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేకపోయాయి. 2022లో వచ్చిన ధమాకా తో పెద్ద విజయం అందుకున్న రవితేజ, ఆపై సినిమా కథల సెలక్షన్ విషయంలో గాడితప్పారు. అయితే అప్పటి నుండి తమ అభిమాన నటుడికి పెద్ద విజయం దక్కాలని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. కాగా వారి కోరిక ఫలించి తాజాగా రిలీజ్ అయిన ఇరుముడి చిత్రంతో ఆయన పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు.
ముందుగా పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రంలోని మల్లెపూల పల్లకి సాంగ్ మాత్రం శ్రోతల నుండి విశేషమైన ఆదరణ సొంతం చేసుకుంది. అనంతరం రిలీజ్ చేసిన ఇరుముడి ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ఇక రిలీజ్ రోజు మొదటి షో నుండే థియేటర్స్ లో అభిమానులని, ప్రేక్షకులని ఎంతో అలరించిన ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో కూడా విజయఢంకా మ్రోగించసాగింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించారు.
తమిళ నటి స్వశిక, సీనియర్ నటుడు సాయి కుమార్ సహా పలువురు ఇతర నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు చేసారు. ముఖ్యంగా ఈ చిత్రంలో రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. థియేటర్స్ లో మొదటి రోజు నుండి మంచి పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన ఇరుముడి బాక్సాఫీస్ ఊచకోత, చివరికి రూ. 250 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేవరకు చేరింది.
రవితేజ ఈ చిత్రంలో త్రినాధ్ అనే పాత్రలో తన సహజ నటనతో అందరినీ అలరించారు. దర్శకుడు శివా నిర్వాణ ఆకట్టుకునే టేకింగ్, నిర్మాతల మంచి నిర్మాణ విలువలు, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హృద్యమైన ఎమోషనల్ సన్నివేశాలు వంటివి ఈ చిత్ర భారీ విజయంలో ప్రధాన భూమిక పోషించాయి. అయితే థియేటర్ రిలీజ్ అనంతరం తాజాగా ఇరుముడి చిత్రం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. థియేటర్స్ లో అందరినీ అలరించిన ఈ చిత్రం అటు ఓటిటిలో కూడా బాగా ఆదరణ సొంతం చేసుకుంటూ టాప్ లో దూసుకెళ్తోంది. మరి ఈ చిత్రం పూర్తి ఓటిటి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
చిత్రం : ఇరుముడి (Irumudi)
నటీనటులు : రవితేజ (Raviteja), ప్రియా భవాని శంకర్ (Priya Bhavanishankar), సాయి కుమార్, బేబీ నక్షత్ర (Baby Nakshatra), స్వశిక, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర తదితరులు.
దర్శకత్వం : శివ నిర్వాణ
నిర్మాతలు : వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
ఫోటోగ్రఫి : విష్ణుశర్మ
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
కథ :-
ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన త్రినాథ్ (రవితేజ) బాడుగ ఆటో నడుపుతూ భార్య కావేరి (ప్రియా భవాని శంకర్) కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర) లతో కలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. అయితే అతడు తాగుడుకి బానిస కావడంతో భార్య ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడు ఆ అలవాటు మాత్రం మానలేకపోతాడు. కానీ ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరించినప్పుడు మాత్రమే అతడు తాగుడుకు దూరంగా ఉంటాడు. అలానే ఊరిలోని అమ్మాయిలు అందరిలో తన కూతురినే చోసుకుంటూ ఉంటాడు.
కాగా ఒకానొక సమయంలో హఠాత్తుగా ఒక స్కూల్ అమ్మాయి హత్య జరుగుతుంది. దానితో ఒక్కసారిగా ఊరు మొత్తం ఉలిక్కిపడుతుంది. అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, ఎవరు చంపారు. అదే స్కూల్ లో చదివే గాయత్రీ పడే బాధలు మణికంఠకి ఎలా తెలిసాయి. తాను ఇకపై ఎన్నడూ తాగనని త్రినాధ్ కూతురు మణికంఠ కి ఎందుకు మాటిచ్చాడు, అసలు ఆపై కథ ఏవిధంగా మలుపు తిరుగుతుంది, ఒక ఆడబిడ్డకు తండ్రిగా త్రినాథ్ ఏమి చేసాడు, చివరికి నిందితులు ఎలా దొరికారు అనేది మొత్తం మనం సినిమాలో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ముందుగా ఈ చిత్రంలో త్రినాథ్ పాత్రలో రవితేజ నటన చాలా బాగుంది. కూతురితో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన మరింత హృద్యంగా ఆకట్టుకుంటుంది. తాగుబోతు తండ్రిగా తన బిడ్డ కోసం మారడం, ఆపై ఆ పాత్ర నడిచిన తీరు ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది.ఆయన భార్య పాత్రలో నటించిన ప్రియా భవాని శంకర్ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. ఇక ప్రధానంగా మణికంఠ గా త్రినాథ్ ముద్దులుగా కూతురిగా నటించిన బేబీ నక్షత్ర నటన ఇరుముడి కి ప్రధాన బలం. ప్రతి సన్నివేశంలో నక్షత్ర ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అందుకుంది.
ఇక ఇతర కీలక పాత్రలు చేసిన స్వశిక, రమేష్ ఇందిర, జబర్దస్ కొమురం, అజయ్ ఘోష్ కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించి అలరించారు. ఇక దర్శకుడు శివ నిర్వాణ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. ముఖ్యంగా తండ్రి, కూతురి అనుబంధం, ప్రేమ ప్రధానంగా రాసుకున్న కథతో ఆకట్టుకునే కథనంతో చిత్రాన్ని ఆయన తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. ఎక్కువగా కంటెంట్ పై ఫోకస్ పెట్టి కథనాన్ని ఎక్కడ కూడా ప్రక్కదారి పట్టించకుండా ఆయన చక్కగా తీశారు. జివి ప్రకాష్ అందించిన సంగీతం, విష్ణు శర్మ విజువల్స్ వంటివి ఈ చిత్ర భారీ విజయానికి ప్రధాన భూమికలు.
మైనస్ పాయింట్స్ :
ఆకట్టుకునే కథ, కథనాలతో బరువైన ఎమోషల్ సీన్స్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలో పెద్దగా మైనస్ పాయింట్స్ లేవు. కథనంలో వచ్చే కొన్ని సన్నివేశాలు మరింత బలంగా రాసుకుని ఉండాల్సింది. అలానే ఎమ్యెల్యే, రవితేజ మధ్య వచ్చే సీన్స్ తో పాటు చిత్రంలో ఉన్న హైప్ చిత్రం మొత్తం కొనసాగించలేకపోయారు.
సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు శివ నిర్వాణ గురించి మాట్లాడుకుంటే కథ, కథనాలు చాలా వరకు ఆకట్టుకుని ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా హృద్యంగా రాసుకున్నారు. అలానే తండ్రి, కూతురు మధ్య వచ్చే ఎమోషనల్, సరదా సన్నివేశాలు థియేటర్స్ లో అందరినీ అలరిస్తాయి. క్లైమాక్స్ సీన్స్ సినిమాకు ఎంతో కీలకంగా మరింత హృద్యంగా రాసుకోవడం ప్రధాన బలం.
సంగీత దర్శకుడు జివి ప్రకాష్ అందించిన పాటలు పలు కీలక సీన్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా మల్లెపూల పల్లకి పాటకి ప్రేక్షకులు అభిమానులు అందరూ కథానుగుణంగా ఎంతో కనెక్ట్ అవుతారు. ఫోటోగ్రాఫర్ విష్ణుశర్మ విజువల్స్ ఎంతో బాగున్నాయి, పలు సీన్స్ సహజత్వానికి దగ్గరగా చూపించారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి చిత్రానికి అవసరమైన సీన్స్ మాత్రమే కరెక్ట్ గా కట్ చేసారు. ఇక నిర్మాతలు నవీన్, రవిశంకర్ సినిమా కోసం ఎంతో బాగా నిర్మాణ పరంగా కాంప్రమైజ్ కాకుండా కథనం మేరకు ఖర్చు చేసారు.
తీర్పు :
రవితేజ, శివ నిర్వాణం కలయికలో వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతకుమించి సెకండ్ హాఫ్ లో వచ్చే కీలక యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాలు హృద్యంగా అందరినీ ఆకట్టుకుని పలు సీన్స్ అయితే మనసుని కదిలిస్తాయి. ఆ విధంగా దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
హీరో రవితేజ తన పాత్రలో ఒదిగిపోయి నటించగా, ఆయన కూతురిగా నటించిన బేబీ నక్షత్ర నటన మరింత అద్భుతం. ఆమె నటించిన కీలక సీన్స్ కు కళ్ళు చెమ్మగిల్లుతాయి, ఆ స్థాయిలో నాటించి ఆకట్టుకుంది. ఇతర పాత్రధారుల నటన కూడా బాగుంది. సంగీత దర్శకుడు జేవీ ప్రకాష్, సహా సాంకేతిక నిపుణులు అందరూ కూడా బాగా పనిచేసారు. కుటుంబసమేతంగా చూడదగ్గ ఇరుముడి చిత్రం అందుకే థియేటర్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని ఓటిటి లో కూడా అదరగొడుతోంది.
ముగింపు :
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ఇరుముడి ఇటీవల థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకాభిమానులని ఆకట్టుకుని బిగ్గెస్ట్ సక్సెస్ సొంతం చేసుకుంది. ప్రతి ఒక్క పాత్రధారి అద్భుత నటన, పాటలు, అలరించే కథ కథనాలు ఈ చిత్ర విజయానికి ప్రధాన భూమిక పోషించాయి. తండ్రి కూతురు మధ్య సాగే ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఇరుముడి చిత్రం తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓటిటి మాధ్యమంలో డిజిటల్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఒకవేళ ఇంకా ఈ చిత్రాన్ని చూడనివారు కుటుంబసమేతంగా చూసి మీ అభిప్రాయం తెలపండి.
ఇటువంటి తాజా చిత్రాల రివ్యూస్, లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ కోసం మా సినిమా తెలుగు చూడండి
రచయిత విక్రమ్ రాసిన ఈ ఆర్టికల్ 25 సెప్టెంబర్ 2026న పబ్లిష్ చేయబడింది.

