నాని ది ప్యారడైజ్ మూవీ పూర్తి విశ్లేషణ
నాచురల్ స్టార్ నాని ఇటీవల కెరీర్ పరంగా వరుసగా మంచి విజయాలతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తన కెరీర్ బిగినింగ్ నుండి ప్రతి ఒక్క మూవీ స్క్రిప్ట్ ని జాగ్రత్తగా ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని పేరుని సొంతం చేసుకుంటూ ఆయన కొనసాగుతున్నారు. కెరీర్ పరంగా ఆయన చేసిన చాలా పాత్రలు ప్రేక్షకాభిమానుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.
ఇక తాజాగా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, ఐవివై ఎంటర్టైన్మెంట్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. అందాల నటి కయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుధాకర్ చురుకూరి, ఇషాన్ సక్సేనా ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుండి ముందుగా రిలీజ్అయినా ఆయా షేర్, ఏష నాగుల సాంగ్స్ రెండూ కూడా శ్రోతల నుండి విశేషమైన ఆదరణ సొంతం చేసుకుని చిత్రం పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా నటించిన ది ప్యారడైజ్ చిత్రంలో బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయల్, ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేసారు. అయితే ట్రైలర్ లేకుండా నేడు డైరెక్ట్ గా రెండు తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎంత మేర అందరినీ ఆకట్టుకుంది, అలానే టాక్ ఎలా ఉంది అనేది మొత్తం ఇప్పుడు పూర్తి విశ్లేషణలో చూద్దాం.
చిత్రం : ది ప్యారడైజ్ (The Paradise)
నటీనటులు : నాని (Nani), కయదు లోహర్ (Kayadu Lohar), మోహన్ బాబు (Mohan Babu), రాఘవ్ జుయల్, తనికెళ్ళ భరణి, సోనాలి కులకర్ణి, ఈశ్వరి రావు, సంపూర్ణేష్ బాబు తదితరులు.
దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల
నిర్మాతలు : సుధాకర్ చెరుకూరి, ఇషాన్ సక్సేనా
సంగీతం : అనిరుద్ రవిచందర్
ఫోటోగ్రఫి : సిహెచ్ సాయి
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమా తెలుగు రేటింగ్ : 2.5 / 5
కథ :-
1980ల కాలం నటి కథగా ది ప్యారడైజ్ అనే ప్రాంతం నేపథ్యంలో చిత్రం సాగుతుంది. అణగారిన తమ జాతి హక్కుల కోసం సమ్మక్క (సోనాలి కులకర్ణి) అక్కడి ప్రజలతో కలిసి పోరాడుతుంటుంది. అయితే మొదటి నుండి వాళ్ళ జాతిని అంతం చేస్తూ సర్వనాశం చేస్తుంటాడు క్రూరుడైన షికంజ మాలిక్ (మోహన్ బాబు). అతడికి భయపడి వారెవ్వరూ ఏమి చేయలేకపోతారు. అయితే ఆ తరువాత సమ్మక్కకు కొడుకు జడల్ (నాని) పుడతాడు. మొదటి నుండి అతడికి తల్లిపై ద్వేషం, మరి అతడు ఎందుకు తల్లి పై ద్వేషం పెంచుకున్నాడు, వారి జాతి పోరాటానికి అండగా నిలిచాడా, మరి సమ్మక్క పై అతడు ద్వేషం పెంచుకోవడానికి కారణం ఏంటి, ఆమె ఏదైనా తప్పు చేసిందా, మరి చివరికి తల్లితో అతడు కలిశాడా, తమ జాతి పోరాటాన్ని గెలిపించాడా లేదా ఆపై కథ ఏవిధంగా మలుపులు తిరుగుతుంది అనేది మొత్తం వెండితెర పై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ప్రధమంగా చెప్పుకోవాలి అంటే ది ప్యారడైజ్ చిత్రానికి హీరో నాని ప్రధాన బలం. మొదటి నుండి మంచి లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో అలరించిన నాని ఈ చిత్రంలో జడల్ గా పవర్ఫుల్ మాస్ పాత్రలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అటు ఫైట్స్, యాక్షన్ సీన్స్ లో మాత్రమే కాదు పలు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అయన నటన అదరహో. నాచురల్ స్టార్ గా మరొక్కసారి ప్రేక్షకాభిమానుల హృదయాలు గెలిచారు నాని. ఇక హీరోయిన్ కయదు లోహర్ కూడా తన పాత్ర పరిధి మేరకు అందం, అభినయంతో అలరించింది. అలానే కథకు కీలక పాత్ర అయిన సమ్మక్క పాత్రలో సోనాలి కులకర్ణి నటన కూడా ఎంతో బాగుంది.
ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె హృద్యంగా నటించి అలరించింది. ఆమెకు, నానికి మధ్యన వచ్చే పలు సీన్స్ హృద్యంగా ఉంటాయి. అలానే మాలిక్ అనే విలన్ గా పవర్ఫుల్ పాత్రలో మంచు మోహన్ బాబు నటన కూడా అద్భుతం. కెరీర్ పరంగా ఎన్నెన్నో పాత్రలు చేసిన మోహన్ బాబుకు ఈ పాత్ర మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కొన్ని యాక్షన్ సీన్స్ ని బాగా తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు అనిరుద్ అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా బాగానే ఉంది. సిహెచ్ సాయి విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కథ కథనాలకు అనుగుణంగా గ్రాండ్ గా ఖర్చు చేసి చిత్రాన్ని నిర్మించారు, స్క్రీన్ పై పలు సీన్స్, సెట్స్ విజువల్ గా బాగుంటాయి.
మైనస్ పాయింట్స్ :
మంచి హైప్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది ప్యారడైజ్ లో పలు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఎంచుకున్న కథ మెయిన్ పాయింట్ బాగున్నప్పటికీ కథనాన్ని ప్రేక్షకులని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో తడబడ్డారు. ఫస్ట్ హాఫ్ బాగానే సాగిన ఈ చిత్రం ఇంటర్వెల్ ముందు వచ్చే భారీ యాక్షన్ సీన్ తో సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తి ఏర్పరుస్తుంది. ఆ సీన్ కి అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరహో, సీన్ ని మరొక లెవెల్ కి ఆయన తీసుకెళ్లారు. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభం నుండి చిత్రం పై మెల్లగా నిరాసక్తతని ఏర్పరుస్తుంది. ఎక్కువగా ఫైట్స్, రక్తపాతంతో నిండిపోవడంతో పాటు పలు సీన్స్ సింక్ కూడా మిస్ అయింది.
ముఖ్యంగా మంచి నటులైన రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇద్దరినీ దర్శకుడు చిత్రంలో సరిగ్గా వినియోగించలేదు, వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక అనిరుద్ సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువ గజిబిజి గందరగోళంగా హెవీ సౌండ్ తో ఉంటుంది. చాలా వరకు సెకండ్ హాఫ్ సీన్స్ ప్రేక్షకులకి కనెక్ట్ కావు. సాంగ్స్ స్క్రీన్ పై కూడా ఆకట్టుకున్నప్పటికీ కథనంలో పస లేకపోవడంతో ప్రేక్షకులకు వాటిని ఆస్వాదించే ఆసక్తి ఉండదు. క్లైమాక్స్ కూడా చుట్టేసినట్లు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ఉన్నా, అవి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా అనిపించవు. చాలావరకు యాక్షన్ తో రక్తపాతంతో నిండిన ది ప్యారడైజ్ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు. ఎడిటింగ్ విభాగం అక్కడక్కడా కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటె బాగుండేది, సినిమా నిడివి కొంత ఎక్కువగా అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
ముఖ్యంగా ఈ చిత్రంలో ఫోటోగ్రాఫర్ సిహెచ్ సాయి విజువల్స్ ఎంతో బాగున్నాయి, కథనానికి అనుగుణంగా పలు కీలక సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక ఎడిటర్ నవీన్ నూలి పనితనం బాగున్నా అక్కడక్కడా కొన్ని సీన్స్ తొలగించాల్సింది. సంగీత దర్శకుడు అనిరుద్ మరొకసారి సాంగ్స్ తో అదరగొట్టగా, అక్కడక్కడా కొన్ని కీలక సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కథనం విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సింది. సుధాకర్ చెరుకూరి, ఇషాన్ సక్సేనా ఇద్దరూ నిర్మాణ విలువల విషయంలో ఆలోచించకుండా భారీ స్థాయిలో ఖర్చు చేసారు.
తీర్పు :
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తీసిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. జడల్ గా హీరో నాని ఆకట్టుకునే నటన, అలరించే సాంగ్స్, ఆకట్టుకునే విజువల్స్ ఇందులో ప్రధాన బలాలు. అయితే కథకు తగ్గట్లుగా కథనం లేకపోవడంతో ప్రేక్షకులు ఆశించిన ఎంటర్టైన్మెంట్ ఇందులో అంతగా లభించదు. దర్శకుడు శ్రీకాంత్ తీసుకున్న కథని స్క్రీన్ పై మరింత ఇంటరెస్టింగ్ గా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది.
ముగింపు :
కాగా నేడు రిలీజ్ అయిన నాచురల్ స్టార్ అని ది పారడైజ్ మూవీ ప్రేక్షకాభిమానులు ఆశించిన స్థాయి అంచనాలు అందుకులేకపోయింది. పలు యాక్షన్ సీన్స్, నాని యాక్టింగ్, అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, ముఖ్యంగా విజువల్స్ వంటివి ఈ చిత్రంలో అలరించే అంశాలు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో ఎక్కువగా వరుసగా యాక్షన్ సీన్స్ రక్తపాతం వంటివి దీనిని ఫ్యామిలీ ప్రేక్షకులకు దూరం చేసే ఛాన్స్ ఉంది. వీలైతే ఈ చిత్రాన్ని మీ సమీప థియేటర్స్ లో ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని తెలపండి.
ఇటువంటి మరిన్ని తాజా సినిమాల రివ్యూస్, లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ కోసం మా సినిమా తెలుగు చూడండి.
రచయిత విక్రమ్ రాసిన ఈ ఆర్టికల్ 24 సెప్టెంబర్ 2026 న పబ్లిష్ చేయబడింది.

