విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ తెలుగు - నెట్ ఫ్లిక్స్ ఓటిటి

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో చూడాలా వద్దా?

విశ్వనాథ్ అండ్ సన్స్ పూర్తి వివరణాత్మక రివ్యూ

చిత్రం : విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons)

నటీనటులు : సూర్య, మమిత బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్, హర్ష చెముడు, 

సర్వదమన్ బెనర్జీ

దర్శకుడు : వెంకీ అట్లూరి

నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

సంగీతం : జివి ప్రకాష్ కుమార్

ఫోటోగ్రఫి : నిమిష్ రవి

ఎడిటర్ : నవీన్ నూలి

తమిళ స్టార్ నటుడు సూర్య (Suriya) ఇటీవల వీరభద్రుడు (Karuppu) చిత్రం ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు. ఆర్ జె బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుని మంచి విజయం సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల అంతకముందు ఆశించిన స్థాయిలో సక్సెస్ లేక సతమతం అవుతున్న సూర్య కెరీర్ కి వీరభద్రుడు విజయం మంచి బ్రేక్ ని అందించింది. దాని అనంతరం తెలుగు యువ దర్శకుడు వెంకీ అట్లూరి తో సూర్య చేసిన తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్.

తెలుగు తో పాటు తమిళ్ లో కూడా రిలీజ్ అయిన ఈ చిత్రం కూడా అద్భుత విజయం సొంతం చేసుకుంది. కుటుంబసమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీకి యువ సంగీత తరంగం జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎంతో గ్రాండ్ గా భారీ వ్యయంతో నిర్మించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం యువత మనసులని దోచి అందరినీ ఆకట్టుకుంటున్న యువ అందాల కథానాయిక మామితా బైజు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా సీనియర్ నటీమణులు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ (Raveena Tandon), అలానే నాజర్, సునీల్ రెడ్డి, హర్ష చెముడు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

అయితే రిలీజ్ కి ముందు ఈ చిత్రం సంగీత పరంగా కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని చిత్రం పై ఎంతో మంచి క్రేజ్, హైప్ ఏర్పరిచింది. ఇక ఈ చిత్రంలో సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య నటించగా మ్యాడిగా మమిత నటించారు. కాగా థియేటర్స్ లో రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ పరంగా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే అటు థియేటర్స్ లో ఆకట్టుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం మూడు రోజల క్రితం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ గా ఆడియన్సు ముందుకు వచ్చింది. మరి వెండితెరపై అలరించి అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓటిటి ప్రేక్షకులని సైతం ఆకట్టుకుంటూ కొనసాగుతోంది. కాగా ఇప్పుడు చిత్రం పూర్తి విశ్లేషణ చూద్దాం.

కథ:-

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ కథ విషయానికి వస్తే పెద్ద బిజినెస్ మ్యాన్, ఇంటర్నేషనల్ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన సంజయ్ విశ్వనాథ్ తనకు 40 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ వివాహం చేసుకోడు. అయితే తల్లి పదే పదే పెళ్లి చేసుకోమని అడుగుతుండడంతో సరోగసి ద్వారా బిడ్డని కని ఆమెకు అందిస్తాడు. కాగా ఒకరోజు హఠాత్తుగా ఆ బిడ్డకు తీవ్ర అనారోగ్యం కలగడంతో పలు వైద్య పరీక్షల అనంతరం బోన్ మ్యారో అవసరం అని చెప్తారు డాక్టర్లు. అందుకోసం మ్యాడిని విశ్వనాథ్ సంప్రదించడం జరుగుతుంది. ఆపరేషన్ కి ఒప్పుకున్న మ్యాడి ఆపై విశ్వనాథ్ ని ప్రేమించి అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. మరి మ్యాడి చివరికి అతడిని పెళ్లి చేసుకుందా లేదా, అసలు ఇంతకీ మ్యాడి ఎవరు, ఆమె ప్రేమను విశ్వనాథ్ ఒప్పుకున్నాడా, అనంతరం కథనం ఏ విధంగా ముందుకు సాగింది అనేది మొత్తం చిత్రంలో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :-

ముఖ్యంగా విశ్వనాథ్ అండ్ సన్స్ లో టైటిల్ రోల్ పోషించిన హీరో సూర్య ఆ రోల్ లో అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. పలు కీలక యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో అతడి నటన మరింత ఆకట్టుకుంటుంది. ఇక మ్యాడిగా మమిత బైజు (Mamitha Baiju) సరదా, యాక్షన్ పెర్ఫార్మన్స్ అందరినీ అలరిస్తుంది. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న మమిత పాత్ర ఈ చిత్రానికి ప్రధాన బలం. అలానే సూర్య తల్లిగా కీలక పాత్ర చేసిన సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కూడా తన రోల్ తో ఆకట్టుకున్నారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన రవీనా టాండన్, సర్వదమన్ బెనర్జీ, హర్ష చెముడు కూడా తమ తమ రోల్స్ లో ఒదిగిపోయి నటించారు. మరీ ముఖ్యంగా దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఫ్యామిలీ, ఎమోషనల్ సన్నివేశాలతో అలరించేలా స్క్రిప్ట్ ఎక్కడ బోర్ కొట్టకుండా రాసుకుని తెరకెక్కించిన విధానం బాగుంది. తల్లి కొడుకులుగా సూర్య, రాధిక ఎంతో ఒదిగిపోయి నటించారు. కలర్ఫుల్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సీన్స్ వంటివి విశ్వనాథ్ అండ్ సన్స్ లో ప్రేక్షకులను అలరిస్తాయి. 

మైనస్ పాయింట్స్ :-

ఈ చిత్రంలో మైనస్ పాయింట్స్ అంతగా లేవని చెప్పాలి. సూర్య పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ, ఎమోషన్ ని మరింత బలంగా చూపించేలా దర్శకుడు వెంకీ ఇంకొన్ని సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ ఆద్యంతం సూపర్ గా సాగిన ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల కొద్దిగా నెమ్మదిస్తుంది. అలానే హీరో హీరోయిన్స్ మధ్య లవ్ సీన్స్ మరింత ఇంటరెస్టింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది. 

సాంకేతిక విభాగం :-

ముందుగా విశ్వనాథ్ అండ్ సన్స్ లో దర్శకుడు వెంకీ అట్లూరి కథ, కథనాలను ప్రేక్షకులని ఆకట్టుకునేలా చక్కగా తెరకెక్కించారు. కథ ఏదైనా సరే దానిని ప్రధానంగా ప్రేక్షకులని మెప్పించేలా కథనంతో వారిని కదలకుండా థియేటర్ లో కుర్చీకి కట్టేసి పాత్రలతో మమేకం చేస్తే ఆ చిత్రం అద్భుత విజయం తథ్యం. ఆ విధంగా ఈ చిత్రాన్ని అందరినీ అలరించేలా తీయడంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు. చాలావరకు సన్నివేశాలు మనకు సహజంగా అనిపిస్తాయి. పాత్రల మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా పూర్తిగా సహజంగా అనిపిస్తుంది. అలానే కథ ఎక్కడా ప్రక్కదారి పట్టకుండా ప్రతి సన్నివేశాన్ని చక్కగా కూర్చి తెరకెక్కించిన విధానం కూడా బాగుంది. చిత్రంలో రిచ్ కలర్ఫుల్ విజువల్స్ ని అందించిన ఫోటోగ్రాఫర్ నిమిష్ రవి బాగా పనితనం ఎంతో బాగుంది. సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ అందించిన సాంగ్స్, కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలరిస్తుంది. అలానే ఎడిటింగ్ పరంగా నవీన్ నూలి చిత్రానికి అవసరం అయినంతవరకు కరెక్ట్ గా కట్ చేసారు. 

తీర్పు :-

దర్శకుడు వెంకీ అట్లూరి, విలక్షణ నటుడు సూర్య ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ అన్నివర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ప్రేమ, ఎమోషన్, ఫ్యామిలీ అంశాలు ఈ సినిమాలో ప్రధానంగా ఎక్కడా బోర్ కొట్టకుండా అందరినీ అలరిస్తాయి. నిజానికి 40 ఏళ్ళు పైబడిన హీరోని యుక్త వయసులో ఉన్న అమ్మాయి ప్రేమించడం, వారి మధ్య సన్నివేశాలు ఎక్కడా కూడా శృతి మించకుండా, అసభ్యతకు తావివ్వకుండా చక్కగా చూపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ముఖ్యంగా హీరో సూర్య, హీరోయిన్ మమితతో పాటు నటి రాధికా శరత్ కుమార్ సహా ప్రతి ఒక్కరి నట బాగుంది. రిచ్ విజువల్స్, అలరించే సాంగ్స్, దర్శకుడు వెంకీ అట్లూరి ఆకట్టుకునే టేకింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు.

ముగింపు :-

తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఎన్నో అంచనాల నడుమ ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ అలరించే కథ, కథనాలు, సూర్య మమిత ల ఆకట్టుకునే నటనతో అన్ని వర్గాలని మెప్పించి మంచి సక్సెస్ సంపాదించింది. ఎక్కడా కూడా బోర్ కొట్టని కథ, కథనాలు, ఎంతో సహజంగా ఆకట్టుకునేలా అలరించేలా రాసుకున్న పాత్రలు. తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించిన నటీనటులు చక్కటి పెర్ఫార్మన్స్, అలరించే సాంగ్స్, లవ్, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లు రాబట్టిన ఈ చిత్రాన్ని వీలైతే కుటుంబసమేతంగా తప్పకుండా నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో చూసి ఆనందించండి. 

సినిమా తెలుగు రేటింగ్ : 3.5 / 5

ఇటువంటి మరిన్ని తాజా సినిమాల రివ్యూస్, లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ కోసం మా సినిమా తెలుగు చూడండి

రచయిత విక్రమ్ రాసిన ఈ ఆర్టికల్ 22 సెప్టెంబర్ 2026 న పబ్లిష్ చేయబడింది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *