పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ 2 తాజా అప్డేట్ డీటెయిల్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ఇటీవల సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఓజి (OG). డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈ మూవీలో ఓజాస్ గంభీర గా పవర్ స్టార్ నటించగా సుజీత్ తెరకెక్కించారు. అందాల నటి ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటించిన ఓజి మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు. అయితే అంతకముందు కెరీర్ పరంగా సరైన సక్సెస్ కోసం సతమతం అయిన పవన్ కళ్యాణ్ కు ఓజి మూవీ బిగ్గెస్ట్ సక్సెస్ కెరీర్ పరంగా బిగ్గెస్ట్ బ్రేక్ ని అందించింది.
ఇందులో పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ నటనకు అందరి నుండి మంచి క్రేజ్ లభించింది. మొదటగా ఓజి మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయి క్రేజ్, హైప్ ఏర్పరిచాయి. ఆ తరువాత రిలీజ్ అయిన ప్రతి సాంగ్ సినిమా పై అంతకంతకు క్రేజ్ మరింత పెంచింది. తన అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో తొలిసారిగా సినిమా చేస్తుండడంతో ఓజి కథ, కథనాల విషయమై దర్శకుడు సుజీత్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. అలానే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్స్ లో అందరినీ ఆకట్టుకుని ఎంతో మంచి క్రేజ్ సంపాదియించాయి.
ఓజీ హంగ్రీ చీతా టీజర్
ముఖ్యంగా ఓజి నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ హంగ్రీ చీతా (Hungry Cheetah Teaser) టీజర్ అందరి నుండి విశేషమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఆ టీజర్ లో అలాంటోడు మళ్ళీ తిరిగివస్తున్నాడు అంటే అంటూ తమిళ నటుడు అర్జున్ దాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి క్యారెక్టర్ కి ఇచ్చే ఎలివేషన్ తో పాటు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరొక రేంజ్ లో ఉంటాయి. ఇక ముంబై లొకేషన్ సీన్స్, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఎంట్రీ, విజువల్స్ కూడా అదిరిపోవడంతో ఒక్కసారిగా ఓజి పై ఆ టీజర్ ఆకాశమంతటి హైప్ ని తీసుకువచ్చింది. ఇక నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ టీజర్ లో అదిరిపోయాయి. ఆ విధంగా ఒక్క టీజర్ తో ఓజి అందరిలో ఎంతో క్రేజ్ ఏర్పరిచింది.
ఫైర్ స్టార్మ్ సాంగ్ సెన్సేషన్
ఓజిలోని ఫస్ట్ గ్లింప్స్ టీజర్ సృష్టించిన విధ్వంశం తరువాత మూవీ నుండి టీమ్ రిలీజ్ చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ఫైర్ స్టార్మ్ (Fire Storm) కూడా విశేషమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. జపాన్ స్టైల్ బీట్స్, మ్యూజిక్ కంపొజిషన్ తో పాటు అదిరిపోయే బీట్స్, సింగర్స్ వాయిస్ వంటివి ఈ సాంగ్ లో అందరినీ ఆకట్టుకున్నాయి. థమన్ స్టైలిష్ గా కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని తమిళ నటుడు శింబు, రాజకుమారి, దీపక్ బ్లూ, నజీరుద్దీన్, భరత్ రాజ్ రావుల అద్భుతంగా పాడారు. విశ్వ రాసిన ఈ సాంగ్ లిరిక్స్ కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉంటాయి, ఆ విధంగా ఈ సాంగ్ లో తన అభిమాన పవర్ ని అద్భుతంగా ఎలివేట్ చేసి రాయించారు దర్శకుడు సుజీత్. ఆ విధంగా ఫైర్ స్టార్మ్ సాంగ్ మూవీ పై క్రేజ్ మరింతగా పెంచేసింది.
ఓజీ ఓపెనింగ్స్ సెన్సేషన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ ల ఓజి మూవీ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో పాటు సాంగ్స్ తో అందరిలో భారీ హైప్ ఏర్పరచగా, మూవీ రిలీజ్ ముందు రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ప్రీమియర్స్ ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. అనేకమంది పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ ఈ మూవీ ప్రీమియర్ టికెట్స్ ని భారీ స్థాయిలో కొనుగోలు చేసారు. ఆ విధంగా ఓపెనింగ్స్ తోనే ఓజి మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఎంట్రీ, యాక్షన్ సీన్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ వంటివి ఓజి మూవీలో అందరి నుండి మంచి క్రేజ్ అందుకుని ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ ని అందుకుంది.
ఓజీ ఫస్ట్ డే కలెక్షన్ సునామి
ఇక ఓజి మూవీ ప్రీమియర్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్, సాధారణ ఆడియన్స్ ఈ మూవీ చూసేందుకు ఎంతో ఆసక్తి చూపించారు. హీరో పవన్, హీరోయిన్ ప్రియాంక మోహన్ మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో ఒమీ బహు పాత్ర చేసారు. తొలిసారిగా ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ తన పాత్రలో అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో అందరినీ అలరించారు.
ఇక పవన్ స్టయిలిష్ ఎంట్రీ, ఫైట్స్, మరీ ముఖ్యంగా భారీ స్థాయిలో ఆకట్టుకున్నది మూవీలోని ఇంటర్వెల్ ఎపిసోడ్. పవన్ ఫ్యాన్స్ ఆ సీన్ కి ఎంతో ఉప్పొంగిపోయారు. ఆ విధంగా దర్శకుడు సుజీత్ ఆ ఎపిసోడ్ ని బాగా రాసుకోగా, విజువల్ గా అదరగొట్టడంతో పాటు సంగీత దర్శకడు ఎస్ థమన్ ఆ ఎపిసోడ్ కి తన బీజీఎమ్ తో ప్రాణం పోశారు. ఇక పవన్ అయితే పవర్ఫుల్ స్థాయిలో పెర్ఫార్మ్ చేసారు. ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ అనంతరం ఓజి సెకండ్ హాఫ్ పై అందరిలో మరింత ఆసక్తి ఏర్పడుతుంది.
ఓజీ సూపర్ సక్సెస్
ఇక పవన్ కళ్యాణ్ ఓజి మూవీ ప్రీమియర్స్ నుండే సక్సెస్ టాక్ అందుకోవడంతో పాటు పవన్ ఫ్యాన్స్ ని మరింత ఆకట్టుకోవడంతో వరుసగా చాలా రోజులు బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి కలెక్షన్ ని సంపాదించింది. చాలా రోజుల తరువాత తాము ఆశించిన స్థాయి మూవీని తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ కు అందించారని దర్శకుడు సుజీత్ పై పవన్ ఫ్యాన్స్ ప్రసంశలు కురిపించారు. అయితే సెకండ్ హాఫ్ లో కొంత అక్కడక్కడా సినిమా నెమ్మదించినప్పటికీ మూవీ ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ ని సొంతం చేసుకున్న ఓజి మూవీ పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మూవీగా నిలిచింది. ఓజి క్లైమాక్స్ సీన్ తో పవర్ఫుల్ ముగింపు ఇచ్చి సెకండ్ పార్ట్ పై మరింత ఆసక్తి ఏర్పరిచారు దర్శకుడు సుజీత్.
ఓజీ 2 మూవీ అప్ డేట్
అయితే అక్కడి నుండి ఓజి మూవీ సీక్వెల్ పై అందరిలో మరింత ఇంటరెస్ట్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం మరింతగా ఎదురుచూస్తున్నారు. ఓజి మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించగా సీక్వెల్ ని పవన్ కళ్యాణ్ సొంతం సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ వారు మరింత భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల పవన్ బర్త్ డే సందర్భంగా ఓజి 2 (OG 2) మూవీ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ని టీమ్ గ్రాండ్ గా రిలీజ్ చేసింది.
అందులో పవన్ కళ్యాణ్ ఆర్ట్ లుక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ వంటివి అదిరిపోయాయి. అలానే ఈ భాగంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తాలూకు ఒక పవర్ఫుల్ ఎపిసోడ్ ఉందని ఆ ఎపిసోడ్ థియేటర్స్ లో రిలీజ్ అనంతరం అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అని సినీ వర్గాల సమాచారం. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర క్యారెక్టర్ తాలూకు ప్రారంభ జీవితం కథ ప్రారంభం వంటి అంశాలు ఓజి పార్ట్ 2 లో మరింత ఆకట్టుకోనున్నాయట.
ఓజీ 2 మూవీ షూటింగ్ డీటెయిల్స్
ఇటీవల పవన్ కళ్యాణ్ టీమ్ నుండి అందిన సమాచారం ప్రకారం ఓజి 2 మూవీ కోసం ఆయన దాదాపుగా 70 రోజుల కాల్ షీట్స్ ని అందించేందుకు సిద్ధం అయ్యారట. అయితే దర్శకుడు సుజీత్ ప్రస్తుతం హీరో నానితో బ్లడీ రోమియో చిత్రం తీసే సన్నాహాలు చేస్తుండడంతో అది పూర్తి అయిన అనంతరం ఓజి 2 ని పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓజి 2 స్క్రిప్ట్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చని అనంతరం మూవీకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని టీమ్ ప్రారంభించనుందట. గ్రాండ్ లెవెల్లో ఓజి 2 కోసం పలు సెట్స్ ని కూడా నిర్మించనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.
ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో పాటు భారీ స్థాయిలో రూపొందనుందట. ఈ చిత్రం గురించి సంగీత దర్శకుడు థమన్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఓజి 2 మూవీని మరింత ఎంజాయ్ చేస్తారని అన్నారు. దర్శకుడు సుజీత్ రాసుకున్న స్క్రిప్ట్ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. తాను కూడా మూవీ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తునానట్లు తెలిపారు థమన్. త్వరలో ఓజి 2 షూట్ కి సంబంధించి మూవీ టీమ్ నుండి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ఇటువంటి తాజా చిత్రాల రివ్యూస్, లేటెస్ట్ సినిమా అప్ డేట్స్, కోసం మా సినిమా తెలుగు చూడండి.
రచయిత విక్రమ్ రాసిన ఈ ఆర్టికల్ 30 సెప్టెంబర్ 2026న పబ్లిష్ చేయబడింది.

