వారణాసి మూవీలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ - ఏపీ టీజీ ప్రీ రిలీజ్ బిజినెస్ అప్‌డేట్

వారణాసి తెలుగు రాష్ట్రాల హక్కులు రూ.350 కోట్లు?

వారణాసి మూవీ లేటెస్ట్ అప్ డేట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వారణాసి (Varanasi) తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కథానాయికగా నటిస్తుండగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)  ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. దాదాపుగా రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పై తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్ర బడ్జెట్ రూ.1400 కోట్లకు పైగా భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోంది. గుంటూరు కారం (Guntur Kaaram) అనంతరం మహేష్ చేస్తున్న ఈ స్పెషల్ కాంబో మూవీకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆల్మోస్ట్ 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయిందని అలానే వారణాసి చిత్రంలోని కీలకమైన భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ కూడా జరిగిందని రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించారు.

వారణాసి మూవీ బడ్జెట్, షూటింగ్ అప్ డేట్

ప్రస్తుతం చిత్రంలో చిన్న చిన్న సీన్స్ తో పాటు పెండింగ్ ప్యాచ్ వర్క్ కూడా జరుగుతుండగా మహేష్ బాబు అక్టోబర్ మొదటి వారం నాటికి తన భాగం షూటింగ్ మొత్తం పూర్తి చేస్తారని సమాచారం. సినిమా కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో ఎంతో భారీ వ్యయంతో వారణాసి సిటీ తాలూకు భారీ సెట్టింగ్స్ నెలకొల్పారు. వారణాసి షూటింగ్ మొత్తం నవంబర్ మొదటి వారానికి పూర్తి కానుందట. అయితే ఇంకా షూటింగ్ పూర్తి కాక ముందే వారణాసి తెలుగు సినీ చరిత్రలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్స్ లో ఒకటిగా రూ. 350 కోట్ల స్థాయికి చేరవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయని కథనాలు వెలువడ్డాయి, కానీ ఈ విషయంలో స్పష్టమైన అధికారిక ధ్రువీకరణ ఇంకా లేదు. అయితే తాజాగా వారణాసి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.350 కోట్ల వరకు చేరుకుందని అలానే వాటిని ఒక ప్రముఖ సంస్థ దక్కించుకోనున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజమౌళి హీరోగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ రూ. 425 కోట్ల మేర గ్రాస్ ని అలానే రూ. 211 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని పెద్ద రికార్డు సొంతం చేసుకుని టాప్ లో నిలిచింది.

కాగా ఇప్పుడు వారణాసి ఏపీ, తెలంగాణలో రూ.350 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా, అంటే మొత్తంగా మూవీ రూ. 650-700 కోట్ల మేర కలెక్షన్ అందుకుంటే బ్రేకీవెన్ చేరుకుంటుంది. అయితే సినిమాకు ఉన్న హైప్ ని బట్టి ఆ కలెక్షన్ పెద్ద సమస్య ఏమి కాదని, ఓవైపు మహేష్ బాబు హీరో కావడంతో పాటు దిగ్గజ దర్శకడు రాజమౌళి కాంబినేషన్ కావడంతో మంచి టాక్ వస్తే ఆల్మోస్ట్ సింహభాగం పది నుండి పదిహేను రోజుల్లో రాబట్టే ఛాన్స్ లేకపోలేదని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వారణాసి మూవీ కాస్ట్, పాత్రలు, రిలీజ్ డేట్ వివరాలు


ఇక ఈ చిత్రంలో రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో మహేష్ బాబు కనిపించనుండగా మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటికే వారణాసి సాంగ్స్ పూర్తి కాగా ప్రస్తుతం మూవీకి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ ని సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సమకూర్చే పనిలో ఉన్నారు. అటు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఇద్దరూ వారణాసి చిత్రాన్ని తమ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా అభివర్ణించారు.

అందుతున్న లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం వారణాసిలో భారీ యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయని అంచనా. ఇందులో హీరో తండ్రిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తుండగా పలు ఇతర కీలక పాత్రల్లో హాలీవుడ్ నటులు కూడా కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 7 ఏప్రిల్ 2027 న తెలుగు సంవత్సరాది ఉగాది కానుకగా దాదాపుగా 120 కి పైగా దేశాల్లో ఈ మూవీని మేకర్స్ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు చిత్రానికి సంబంధించి 50 భాషల్లో డబ్బింగ్ వర్క్ ని ఒరిజినల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్స్ తో పని చేయిస్తున్నారు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా వారణాసి మూవీని మేకర్స్ హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా భారీ వ్యయంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ తో నిర్మించనున్నారు. ఇక ఈ మూవీ నుండి గత ఏడాది విడుదలైన ఈ చిత్రంలోని సంచారి, రణకుంభ, దేశి గర్ల్ పాటలు అందరి నుండి విశేషమైన స్పందన సొంతం చేసుకుని సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచాయి.

వారణాసి ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ స్పందన

ఎస్ ఎస్ రాజమౌళి వారణాసికి సంబంధించి ఫస్ట్ లుక్ మూవీ కాన్సెప్ట్ టీజర్ ని గ్రాండ్ లెవెల్లో ఒక భారీ ఈవెంట్ ద్వారా ప్రకటించారు. దానికి గ్లోబల్ గా అన్ని భాషలు ఆడియన్స్ నుండి ఎంతో గ్రాండ్ గా రెస్పాన్స్ అయితే లభించింది. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి హీరో మహేష్ బాబు తన డ్రీం ప్రాజక్ట్ అని చెప్పగా, హీరోయిన్ ప్రియాంక చోప్రా మాట్లాడుతూ, చాలా ఏళ్ల అనంతరం భారతీయ సినిమా చేయడానికి దర్శకుడు రాజమౌళి చెప్పిన కథ, కథనాలు ఎంతో ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా మహేష్ తో పాటు పృథ్వీరాజ్ వంటి మంచి నటులతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ, తన కెరీర్ లో ఇటీవల ఎన్నో మంచి సినిమాలు చేసానని, అయితే లైఫ్ లో తొలిసారిగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గారి వంటి గొప్ప దర్శకుడితో పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన అనుభూతి అని అన్నారు. ఓవరాల్ గా వారణాసి రిలీజ్ అనంతరం భారతదేశం గర్వించే చిత్రంగా ఇది నిలుస్తుందని ఆశాభావం అందరూ వ్యక్తం చేసారు. కాగా మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు గ్లోబల్ గా ప్రేక్షకాభిమానులు అందరిలో ఆకాశమంతటి క్రేజ్ ఏర్పరిచిన వారణాసి పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల హీరోగా మహేష్ కి ఆశించిన స్థాయి సక్సెస్ లు అయితే లభించలేదు. 2020లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్, ఆ తరువాత సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata), గుంటూరు కారం చిత్రాలకు విమర్శకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ మహేష్ బాబు తన స్టార్డంతో రెండిటికీ రూ. 110 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోవడం విశేషం.

వారణాసి మూవీ కథ వివరాలు, ప్రమోషన్స్ అప్ డేట్

వారణాసి ద్వారా మహేష్ బాబు మరింత విస్తృత శ్రేణిలో ప్రేక్షకులను చేరుకుంటారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇందులో ఆయన పోషిస్తున్న రుద్ర పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని, ఆ పాత్రలో మహేష్ బాబు నటన ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుంటుందని దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు.

ముఖ్యంగా వారణాసి మూవీ స్టోరీ గురించి ఇటీవల ఆయన పలు సందర్భాల్లో రాజమౌళి ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తిగా కథ ఏ విధంగా సాగుతుంది, ఎటువంటి మలుపు ఉంటాయి అనేది ఇప్పుడే పూర్తిగా వెల్లడించడం కరెక్ట్ కాదని, అయితే ఇది ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య అలానే ఇద్దరు లవర్స్ మధ్యన హృద్యమైన ఎమోషనల్ స్టోరీ గా సాగుతుందని అన్నారు. అంతే కాకుండా ఇందులో అంటార్క్టికా, ఆఫ్రికా అందాలు, వారణాసి గొప్పతనం, ముఖ్యంగా త్రేతాయుగంలో శ్రీరాముల వారి సన్నివేశాలతో పాటు ఇటలీ వంటి ప్రాంతాల అద్భుతమైన అందాలు, టైం ట్రావెల్ అంశాలతో సాగుతుందని తెలిపారు.

చిత్రానికి సంబంధించి ఇటీవల హీరో మహేష్, హీరోయిన్ ప్రియాంక చోప్రా ల పుట్టినరోజులు సందర్భంగా రెండేసి చొప్పున షూటింగ్ స్పాట్ ఫొటోస్ ని టీమ్ ప్రత్యేకంగా విడుదల చేసింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ రెండవ వారం లేదా డిసెంబర్ మొదటి వారం నుండి పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించే అవకాశం ఉంది.

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్న రాజమౌళి బృందం అంతకుమించి ఎన్నో వందల రెట్లు కష్టపడి యాక్షన్ అడ్వెంచర్ టైం ట్రావెల్ వారణాసి చిత్రాన్ని ఎంతో గ్రాండియర్ గా రూపొందిస్తున్నట్లు దీనిని బట్టి మొత్తంగా మనకు అర్ధమవుతోంది.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఇప్పటినుండే రెండు తెలుగు రాష్ట్రాలు, అమెరికా సహా ప్రతి ఏరియాలో భారీ ఆఫర్స్ వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఓటిటి హక్కుల విషయంలో కూడా చిత్రానికి భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నట్లు చెప్తున్నారు. మొత్తంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ అంకె రూ.350 కోట్ల మార్క్ దాటితే అది తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం అవుతుంది.

రూ. 1400 కోట్లతో నిర్మితవుతున్న వారణాసి మూవీ 7 ఏప్రిల్ 2027 న 120 దేశాల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం రిలీజ్ అనంతరం తెలుగు సినిమా చరిత్రలో కొత్త రికార్డులు నెలకొల్పుతుందని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తాజా టాలీవుడ్ న్యూస్ అప్ డేట్స్ కోసం మా సినిమా తెలుగు చూడండి.

విక్రమ్ రాసిన ఈ ఆర్టికల్ 19 సెప్టెంబర్ 2026 న పబ్లిష్ చేయబడింది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *