సర్ధార్ 2 మూవీ తెలుగు రివ్యూ

సర్ధార్ 2 రివ్యూ : కార్తీ స్పై థ్రిల్లర్ ఎలా ఉంది అంటే?

సర్ధార్ 2 మూవీ పూర్తి విశ్లేషణ

మూవీ పేరు : సర్ధార్ – 2 (Sardar 2)

నటీనటులు : కార్తీ (Karthi) , మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఆషిక రంగనాథ్ (Ashika Ranganath), రాజిష విజయన్, ఎస్ జె సూర్య, యోగిబాబు

దర్శకత్వం : పిఎస్ మిత్రన్

నిర్మాతలు : ఎస్ లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా

సంగీతం : సామ్ సి ఎస్

ఫోటోగ్రఫీ : జార్జ్ సి విలియమ్స్

ఎడిటింగ్ : విజయ్ వేలుకుట్టి

తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా మంచి క్రేజ్ కలిగిన నటుల్లో కార్తీ కూడా ఒకరు. తొలిసారిగా తెలుగులో యుగానికి ఒక్కడు మూవీ ద్వారా అద్భుత విజయం సొంతం చేసుకున్న కార్తీ, ఆ తరువాత ఆవారాతో మరొక విజయం అందుకున్నారు. అక్కడి నుండి తమిళ్ మూవీ ఇండస్ట్రీ తో పాటు తెలుగు లో కూడా బాగా మార్కెట్ ని ఏర్పరుచుకున్నారు కార్తీ. తన అన్నయ్య సూర్య ఓవైపు నటుడిగా కొనసాగుతుండగా మరోవైపు కార్తీ కూడా నటుడిగా ఎంతో కష్టపడుతూ మంచి సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆశించిన స్థాయి సక్సెస్ లు అందుకోని కార్తీ, తాజాగా సర్ధార్ 2 మూవీ ద్వారా ప్రేక్షకాభిమానులు ముందుకి వచ్చారు.

కొన్నాళ్ల క్రితం వచ్చి మంచి విజయం అందుకున్న సర్ధార్ మూవీకి ఇది అఫీషియల్ సీక్వెల్. పిఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ మూవీని ప్రిన్స్ పిక్చర్స్, ఐ వి వై ఎంటర్టైన్మెంట్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. ఎస్ లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సెనా నిర్మాతలుగా భారీ వ్యయంతో నిర్మించిన సర్ధార్ 2 కి యువ సంగీత తరంగం సామ్ సిఎస్ సంగీతం సమకూర్చగా జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫి అందించారు. యువ అందాల భామలు ఆషిక రంగనాథ్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా ఈ మూవీలో నటించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ తో అందరిలో బాగా హైప్ ఏర్పరిచిన ఈ మూవీ నేడు గ్రాండ్ గా తెలుగు, తమిళ భాషల్లో పలు థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఎంతమేర ఆడియన్సు ని కార్తీ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది అనేది మొత్తం ఈ రివ్యూలో చూద్దాం.

సర్ధార్ 2 మూవీ స్టోరీ వివరాలు

తమ దేశాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచనతో మొదలెట్టిన డాకు ఆపరేషన్ ని భారత్ మొత్తంగా అడ్డుకుంటుంది. అయితే ఆ తరువాత బ్లాక్ డాగర్ (ఎస్ జె సూర్య) దానిని మళ్ళీ యాక్టివేట్ చేయడంతో దాని ఉదృతిని ఆపి ఆ ముప్పు నుండి భారత్ ని కాపాడేందుకు పలువురు రా ఏజెంట్స్ ప్రయత్నాలు చేస్తారు. కాగా వారిలో సర్ధార్ (కార్తీ), విజయ్ ప్రకాష్ (కార్తీ) మిగతా ఏజెంట్స్ తో కలిసి ఏ విధంగా దేశాన్ని ఆ ఉపద్రవం నుండి రక్షించారు అసలు ఇంతకీ ఆపరేషన్ డాకు వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి ఈ క్రమంలో రా ఏజెంట్స్ అందరూ ఈ విధమైన సమస్యలు ఎదురుకొన్నారు అనే అంశాలతో సర్ధార్ 2 కథ సాగుతుంది.

సర్ధార్ 2 ప్లస్ పాయింట్స్

ముందుగా సర్ధార్ 2 లో డ్యూయల్ రోల్ లో సర్దార్, విజయ్ ప్రకాష్ గా తన సహజ నటనతో ఆకట్టుకున్నారు. పార్ట్ 1 ని మించి మరింత అద్భుతంగా తండ్రి కొడుకుల పాత్రల్లో కార్తీ నటించిన తీరుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలానే హీరోయిన్స్ కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు అందం, అభినయంతో అలరించారు. ఇక పార్ట్ 1 మాదిరిగా ఇందులో కూడా ఒక సెన్సిటివ్ పాయింట్ ని తీసుకుని దర్శకుడు పిఎస్ మిత్రన్ సినిమాని అలరించే రీతిన తెరకెక్కించారు. కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఇక ఎమోషన్స్ కూడా బాగానే పండాయి. విలన్ గా నటించిన ఎస్ జె సూర్య మరొక్కసారి తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.

సర్ధార్ 2 మైనస్ పాయింట్స్

నిజానికి సర్ధార్ పార్ట్ 1 లో పలు యాక్షన్స్ సీన్స్, కథ కథనాలు నడిచిన తీరు ఆకట్టుకుని సక్సెస్ కావడంతో అందరిలో పార్ట్ 2 పై మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఆ అంచనాలు అందుకుని సక్సెస్ అవ్వడంలో సర్ధార్ 2 కొంతమేర విఫలం అయిందని చెప్పాలి. దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగున్నా కథనాన్ని కొన్ని సీన్స్ ని ఆకట్టుకునే రీతిలో తెరకెక్కించలేకపోయారు. గ్రాండియర్ విజువల్స్, కొంతమేర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఆకట్టుకున్నా స్క్రీన్ ప్లే లో లోపాలు బాగా కనపడతాయి. ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్న ఈ మూవీ సెకండ్ హాఫ్ లో కొంత తడబడుతుంది, అలానే యోగిబాబు, ఎస్ జె సూర్య మధ్యన సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక కామెడీ సీన్ చూస్తే అటువంటి వ్యక్తులని అసలు రాఏజెంట్స్ గా తీసుకున్నారు అని మనకు అనిపించకమానదు. అయితే సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువ ఉండడం, దానిని ఆకట్టుకునే రీతిన ముందుకు నడపడంలో దర్శకుడు పిఎస్ మిత్రన్ విఫలం అయ్యారు.

సర్ధార్ 2 టెక్నికల్ అంశాలు

సర్ధార్ 2 లో ఆడియో పరంగా సాంగ్స్ బాగున్నప్పటికీ సినిమాలో ఆశించిన స్థాయి ఫీల్ అందించవు. ఇక గ్రాండియర్ విజువల్స్, ఫోటోగ్రఫి ఈ సినిమాకి ప్రధాన బలంగా చెప్పాలి. ఫోటోగ్రాఫర్ జార్జి విలియమ్స్ ని ఈ విషయంలో ఎంతో మెచ్చుకోవాలి. ఇక ఎడిటర్ విజయ్ వేలుకుట్టి కూడా సీన్స్ ఎడిటింగ్ పరంగా అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్ తొలగించాల్సింది. దర్శకుడు గురించి చెప్పుకోవాలి అంటే సర్ధార్ పార్ట్ 1 ని మించి పార్ట్ 2 ని నడిపించడంలో ఆయన తీసుకున్న పాయింట్, అందించిన సందేశం బాగున్నప్పటీకీ, దానిని ప్రేక్షకులని ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయారు. ఇటువంటి రా ఏజెంట్స్ కథలకు కొంత ఫాస్ట్ పేసింగ్ స్క్రీన్ ప్లే, అలరించే క్యాచీ సీన్స్ అవసరం, కానీ అటువంటివి ఈ సినిమాలో తక్కువ కనపడతాయి. సెకండ్ హాఫ్ మరింత ఇంటరెస్టింగ్ గా రాసుకుని ఉండాల్సింది.

ఫలితం

మొత్తంగా కార్తీ హీరోగా మంచి క్రేజ్ తో నేడు ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చిన సర్ధార్ 2 అంచనాలు ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా కథనాన్ని నడిపించిన తీరు ఆకట్టుకోదు. హీరో కార్తీ నటన, అక్కడక్కడా కొన్ని యాక్షన్ సీన్స్, ఫోటోగ్రఫి, పర్వాలేదనిపించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవాలి. కానీ దీనిని యావరేజ్ మూవీగా చెప్పవచ్చు. అందుకే తప్పకుండా వీలైతే మీ కుటుంబంతో కలిసి సమీప థియేటర్స్ లో సర్ధార్ 2 మూవీ చూసి ఆనందించండి.

తుది ముగింపు

విలక్షణ నటుడు కార్తీ నటించిన ఓవరాల్ గా చెప్పాలి అంటే, ఆశించిన స్థాయిలో మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. భారీ వ్యయంతో, ఆకట్టుకునే విజువల్స్, యాక్షన్ సీన్స్ తో గ్రాండ్ గా తెరకెక్కినప్పటికీ దర్శకుడు మిత్రన్ దీనిని ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో ఆకట్టుకునే స్థాయిలో తీయలేదు, సాంగ్స్ కూడా అంతా ఆకట్టుకోలేదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదని చెప్పవచ్చు. అయితే కార్తీ నటన మాత్రం రెండు పాత్రల్లో అదిరిపోవడంతో అందరి నుండి మంచి ప్రసంశలు వస్తున్నాయి.

కాగా ఇటువంటి మరిన్ని తెలుగు సినిమా తాజా అప్ డేట్స్, రివ్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్స్ కోసం ఎప్పటికపుడు మా సినిమా తెలుగు మా వెబ్ సైట్ ఫాలో అవ్వండి.  

సినిమా తెలుగు రేటింగ్ : 2.75 / 5

మరిన్ని తెలుగు సినిమా రివ్యూలు, అప్ డేట్స్ కోసం మా సినిమా తెలుగు రివ్యూస్ సెక్షన్ చూడండి

రచయిత విక్రమ్ రాసిన ఈ ఆర్టికల్ 20 సెప్టెంబర్ 2026 న పబ్లిష్ చేయబడింది.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *