ఈ వారం టాలీవుడ్ రిలీజెస్ – థియేటర్లు, ఓటీటీ
ఈ ఏడాది ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు థియేటర్స్ లో సందడి చేసి ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాయి. ముందుగా జనవరి 9 న రిలీజ్ అయిన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, మారుతీ ల క్రేజీ కాంబినేషన్ మూవీ ది రాజా సాబ్ (The Raja Saab) ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది. జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ల తొలి కాంబో మూవీ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) మూవీ మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని అద్భుతంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. జనవరి 13న మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశేయులకు విజ్ఞప్తి మూవీ రిలీజ్ అయి యావరేజ్ విజయం సొంతం చేసుకుంది.
జనవరి 14న యువ నటుడు నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు రిలీజ్ అయి పెద్ద విజయం అందుకుంది. అలానే అదే రోజున శర్వానంద్ హీరోగా రూపొందిన నారి నారి నడుమ మురారి చిత్రం కూడా సూపర్ హిట్ అయింది. వీటితో పాటు తమిళ్ లో తెరకెక్కి తెలుగులో డబ్ అయిన శివ కార్తికేయన్, శ్రీలీల కాంబోలో వచ్చిన పరాశక్తి రిలీజ్ అయి విజయం అందుకోలేకపోయింది.
ఆ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది (Peddi) మూవీ మంచి విజయం సొంతం చేసుకుంది. అలానే సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో రూపొందిన మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) తో పాటు అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన లెనిన్ కూడా సూపర్ హిట్స్ కొట్టాయి. ఇక ఇటీవల మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఇరుముడి తో పాటు సూర్య హీరోగా తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా విజయవంతం అయ్యాయి.
Theatre Releases :-
ది పారడైస్ : (The Paradise)
నాచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎమోషనల్ మాస్ మూవీ ది పారడైస్. ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ పై సుధాకర్ చేరుకొని నిర్మించగా యువ సంగీత తరంగం అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న సినిమాలు చేస్తూ వచ్చిన హీరో నాని, ఇటీవల వచ్చిన దసరా మూవీ అనంతరం మరొకసారి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ పారడైస్ లో జాడల్ అనే పాత్రలో నటించారు.
ఇక తన పాత్రలో నాని యాక్షన్ అదరగొట్టారు. బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి సమ్మక్క గా నాని తల్లి పాత్రలో తన సహజ నటనతో మెప్పించారు. యాక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా నటించిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి యావరేజ్ విజయం అందుకుంది.
హనుమాన్ అంశ్ (Hanuman Ansh)
ఇటీవల బాలీవుడ్ లో చిన్న చిత్రంగా రిలీజ్ అయి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయంగా దూసుకెళ్తోంది హనుమాన్ అంశ్. విశాల్ చతుర్వేది ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఆధ్యాత్మిక కథగా డివోషనల్ అంశాలతో రూపొందిన ఈ మూవీలో శోబినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు. ఆధ్యాత్మిక గురువు నీం కరోలి బాబా జీవిత కథగా రూపొందిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ప్రస్తుతం హిందీ ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ, భారీ స్థాయి బాక్సాఫీస్ కలెక్షన్ సొంతం చేసుకుంటోంది.
చిన్నతనంలో తల్లిని కోల్పోయిన ఒక బాలుడు ఆమెను కలుసుకునేందుకు దైవాన్ని ఆశ్రయిస్తాడు. అదే క్రమంలో దైవత్వాన్ని కనుగొన్న అతడు ఆపై సేవా భావం, సత్యం, ధర్మం, నీతిని అనుసరించి మానవాళికి సీవీ చేయాలని భావించి హనుమాన్ అంశ్ గా నీం కరోలి బాబాగా మారుతాడు. హృద్యమైన ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది.
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (Dont Trouble the Trouble)
మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఫాంటసీ మూవీ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఈ మూవీలో బేబీ సారా పాలేకర్ మరొక ముఖ్య పాత్రలో నటించగా శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు. ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మించిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించే విజయం అందుకుంది. ఆకట్టుకునే యాక్షన్, ఫాంటసీ, అంశాలతో రూపొందిన ఈ మూవీలో సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదని కొంత విమర్శలు వచ్చాయి. అయితే నటుడు ఫహాద్ ఫాసిల్, బేబీ సారా మధ్య వచ్చే ఫన్, యాక్షన్, ఫాంటసీ సీన్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది.
ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam)
విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆదర్శ కుటుంబం. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, నారాయణమ్మ సాంగ్ అందరిని ఆకట్టుకుని మంచి ఆదరణ అందుకోవడంతో పాటు మూవీ పై బాగా క్రేజ్ ఏర్పరిచాయి.
నిజానికి అక్టోబర్ 9న థియేటర్స్ లో ప్రేక్షకాభిమానుల ముందుకి రావాల్సిన ఆదర్శ కుటుంబం టెక్నీకల్ వర్క్ పెండింగ్ కారణంగా వాయిదా పడి అక్టోబర్ చివర్లో రిలీజ్ కానుంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ యాక్టింగ్ తో పాటు త్రివిక్రమ్ టేకింగ్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ సీన్స్ ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ఇటీవల మీడియా మీట్ లో భాగంగా తెల్పింది.
రణబాలి (Ranabaali)
యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ పీరియాడిక్ మూవీ రణబాలి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా అజయ్ అతుల్ సంగీతం సమకూరుస్తున్నారు. పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీ అక్టోబర్ 16న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో పోరాట యోధుడిగా విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ అదిరిపోతుందని టీమ్ చెపుతోంది. ఇక ఈ మూవీలో రష్మిక మందన్న తో పాటు హాలీవుడ్ మమ్మీ మూవీ ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో విలన్ గా చేస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని రణబాలి మంచి విజయం అందుకుంటుందని టీమ్ నమ్మకంగా చెప్తోంది.
జైలర్ 2 (Jailer 2)
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2. ఇటీవల రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకున్న జైలర్ మూవీ కి ఇది సీక్వెల్. తాజాగా జైలర్ 2 నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి.
ఇందులో ఫస్ట్ పార్ట్ ని మించేలా హీరో రజినీకాంత్ పోషించిన ముత్తువేల్ పాండియన్ పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉండనుందని సినీ వర్గాల సమాచారం. దర్శకుడు దిలీప్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని తప్పకుండా జైలర్ 2 మంచి విజయం అందుకుంటుందని టీమ్ అభిప్రాయపడుతోంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీలో ఎస్ జె సూర్య, సూరజ్ వెంజరమూడు విలన్స్ గా చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీని అక్టోబర్ 15న గ్రాండ్ గా పలు భాషల ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.
OTT Releases :-
ఇరుముడి (Irumudi)
మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా యువ దర్శకుడు శివ నిర్వాణం దర్శకత్వంలో రూపొందిన తాజా ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా మూవీ ఇరుముడి. సాయి కుమార్, బేబీ నక్షత్ర, స్వశిక, రమేష్ ఇందిర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేసారు. రిలీజ్ అనంతరం పెద్ద విజయం అందుకున్న ఇరుముడి తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ప్రేక్షకుల ముందుకి వచ్చి బాగా వ్యూస్ సొంతం చేసుకుంటోంది. తండ్రి కూతుళ్ళ హృద్యమైన ఎమోషనల్ కథగా రూపొందిన ఇరుముడికి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి విశేష స్పందన లభిస్తోంది. దర్శకుడు శివా నిర్వాణ చక్కటి టేకింగ్, రవితేజ అద్భుతమైన నటన, ఎమోషనల్, యాక్షన్ అంశాలు, పాటలు వంటివి ఇరుముడి చిత్రానికి అందరి నుండి మంచి ప్రసంశలు అందుకునేలా చేసాయి.
విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons)
సూర్య హీరోగా మమిత బైజు హీరోయిన్ గా యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెకెక్కించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ మూవీలో సీనియర్ నటి రాధిక, నాజర్, రవీనా టాండన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేసారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై నాగవంశీ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ థియేటర్స్ లో సూపర్ హిట్ అందుకుంది. ఇటీవల ఓటిటి లో రిలీజ్ అయిన ఈ మూవీకి డిజిటల్ ప్రసారంలో కూడా ప్రసంశలు అందుతున్నాయి. 40 ఏళ్ళు పైబడిన వ్యక్తిని ప్రేమించిన 23 ఏళ్ళ యువతి చివరికి అతడి ప్రేమని పొందిందా లేదా అనే కథాంశంతో దర్శకుడు వెంకీ ఈ మూవీని అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కించారు.
సర్ధార్ 2 (Sardaar 2)
కార్తీ హీరోగా ఆషిక రంగనాథ్, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సర్ధార్ 2. ఇటీవల రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకున్న సర్ధార్ మూవీకి ఇది సీక్వెల్. పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ మూవీని ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. అయితే ట్రైలర్, సాంగ్స్ తో పెద్దగా హైప్ ఏర్పరచలేకపోయిన సర్ధార్ 2 రిలీజ్ అనంతరం అందరినీ నిరాశపరిచింది. నటించిన రెండు పాత్రల్లో కార్తీ నటన బాగున్నప్పటికీ కథ, కథనాలు ప్రేక్షకాభిమానులని ఏమాత్రం మెప్పించలేదు. ఆ విధంగా థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సర్దార్ 2 మూవీ తాజాగా ఓటిటి లో కూడా అదే విధంగా మెప్పించలేకపోతోంది.
ఇటువంటి తాజా చిత్రాల రివ్యూస్, లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ కోసం మా సినిమా తెలుగు చూడండి
రచయిత విక్రమ్ రాసిన ఈ ఆర్టికల్ 8 అక్టోబర్ 20226 న పబ్లిష్ చేయబడింది.

